త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రజా సమస్యలకు సత్వర న్యాయం జరిగేలా తక్షన చర్యలు తీసుకుంటునట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ను ఆయన నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యల్ను ప్రత్యేకంగా వినడం, వాటికి పరిష్కార మార్గాలను సూచించడం ప్రభుత్వ లక్ష్యంగా భావించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వార్డులు, గ్రామాల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కరెంటు, భూ సమస్యలు, చర్చ్ నిర్మాణం, తాగునీటి సమస్యలు పై వినతులు అందాయి. అన్ని అంశాలపై సంబంధిత శాఖలతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఒక చక్కటి వేదిక అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


