కొత్తపేట:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట రావులపాలెం, సామాన్యుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.73 వినతులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


