ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
6వ డివిజన్ వాంబే గృహాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాజమహేంద్రవరం, నగరంలోని వాంబే గృహాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. స్థానిక 6వ డివిజన్ వాంబే గృహాల వద్ద సెప్టిక్ ట్యాంకులకు, ఉప్పు వీధిలో డ్రైనేజీల కల్వర్టుల మరమ్మతులు చేసేందుకు రూ. 12 లక్షలతో శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా 6వ డివిజన్, ఆదెమ్మ దిబ్బ, లింగంపేట, మున్సిపల్ కాలనీ, రత్నంపేట తధితర ప్రాంతాల్లో ఉన్న వాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. పక్కాగా శానిటేషన్ అమలు జరిగేలా చూస్తున్నామన్నారు. కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
6వ డివిజన్ వాంబే గృహాల్లో నెలకొన్న సెప్టెక్ ట్యాంకుల సమస్యను గతంలోనే తమ సొంత ఖర్చులతో పరిష్కారం చూపిద్దామనుకున్నామని గుర్తు చేశారు. మేమే చేయించుకుంటామని స్థానికులు. ఆనాడు అన్నారని, ఆనాటి నుంచి నేటి వరకూ ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. ఇప్పుడు దానికి పరిష్కార మార్గం చూపిస్తున్నామన్నారు. పక్కనే జాంపేటలో ఉన్న వాంబే గృహాల్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న 33 మంది కుటుంబాల వారికి పట్టాలు లేవని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ 6వ డివిజన్ వాంబే గృహాల వారికి కూడా పట్టాలు లేవని వారందరికీ త్వరలోనే పట్టాలు వచ్చేలా చూస్తామన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారన్నారు. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రూ. 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని డబుల్ ఇంజన్ సర్కారులో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


