ఐదేళ్లు వైఎస్సార్ అధికారంలో ఉంది…
అపుడు లేని ఇబ్బంది ఇప్పుడేంటి..?
కోడి పందాల బరి ఏర్పాటు ను అడ్డుకున్న పోలీసులు…
ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
సి ఐ తో వాగ్వివాదం….
త్రినేత్రం న్యూస్, మండపేట.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారేడు బాక లో బుధవారం సంక్రాంతి పండుగ కోడి పందేలు, నిర్వహణలో వివాదం తలెత్తింది. ప్రతి ఏడాది మారేడుబాక పులగుర్త శివారు లో రెండు చోట్ల బరులు ఏర్పాటు చేస్తారు. వైసిపి నాయకుడు బిసి నేత యాండ్ర ప్రభాకర్రావు( బుజ్జి) ఓ బరిని నిర్వహించగా మరో బరిని కూటమి నాయకులు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సారి బరి ఏర్పాట్లల్లో వివాదం చేలరేగింది. దీంతో పోలీసులకు ఇక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, సమాచారం అందడంతో టౌన్ సిఐ సురేష్ బరులను అడ్డుకున్నారు. ఇక్కడ శాంతిభద్రతలు సమస్య తలెత్తుతుందని తమకు సమాచారం ఉందన్నారు. దీంతో మండపేట పట్టణ పరిధిలోని గొల్ల పుంత లో ఉన్న మూడు బరులు భోగి ఉదయం నుంచే ఆరంభం అయ్యాయి. రూరల్ ప్రాంతంలో కూడా కోడి పందాలు నిర్వహణ చేపట్టారు.
కాగా మారేడుబాక లో మాత్రం నిలిచిపోయింది. దీంతో వైసిపి నాయకుల బరి నిర్వహించకుండా అధికార పార్టీ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన అక్కడికి చేరుకొని సి ఐ తో చర్చించారు. మండపేట టౌన్ పరిధిలో అన్నిచోట్ల నిలిపివేయాలని లేనిపక్షంలో ఇక్కడ కూడా పందాలకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన పలుసార్లు విజ్ఞప్తి చేశారు. దీనికి సి ఐ నిరాకరించారు.
వీరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరికీ సంతోషాన్ని, అందజేయాలని కోరారు. గత వైసీపీ హయంలో సంక్రాంతి సందర్భంగా రాజకీయ లకు అతీతంగా అందరికీ అవకాశం ఇచ్చామన్నారు. ఆ సమయంలో ఈ ఎవరిని తము అడ్డుపెట్టకేదని పేర్కొన్నారు. ఇపుడు కేవలం వైసిపి బీసీ నేత బుజ్జి కి సంబంధించిన బరి నీ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
వైఎస్ఆర్సిపి నాయకులు ఏర్పాటు చేసిన బరిని అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. అధికార పార్టీకి మాత్రమే సంక్రాంతి పండుగ అంటూ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంలో ఉందా అంటూ నిలదీశారు. ఇది న్యాయమా అని పేర్కొన్నారు. అధికారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. పార్టీ పరంగా విభజించి అధికారాన్ని ఉపయోగించి ఇక్కడ పందాలు వేయడం వీల్లేదనీ చెప్పడం, సిగ్గుచేటని ఆరోపించారు. గొల్ల పుంత రోడ్ లో ఎందుకు అనుమతి ఇచ్చారని నిలదీశారు.
అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నాయకులు చేస్తేనే శాంతి భద్రతలు వస్తాయా అంటూ నిలదీశారు. ఇది దుర్మార్గమని పేర్కొన్నారు. మండపేట టౌన్ పరిధిలో ఉన్న అన్ని సంక్రాంతి కోడిపందాల బరులను ఆపాలని డిమాండ్ చేశారు. తాను చేతులు కట్టుకుని కూర్చులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు కోడిపందాల గురించి మాట్లాడారని ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పండుగ అనేది అధికార పార్టీకేనా అన్నారు.
అధికారం అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల మీద కక్ష కట్టడాన్ని తప్పు పట్టారు. సామాన్యులకు కోటీశ్వరులకు పండగ ఒకటేనని పేర్కొన్నారు. తమ పార్టీ నీ అడ్డుకొంటూ తప్పుడు సాంప్రదాయం తీసుకువస్తున్నారని విమర్శించారు. ఒకచోట ఆడించి ఒకచోట నిలిపివేయడం తగదని పేర్కొన్నారు. అన్నిచోట్ల ఆపివేస్తే తాము సహకరిస్తామని, పేర్కొన్నారు. అధికార పార్టీ ఉన్నచోట్ల ఆడిస్తాం ఇక్కడ నిర్వహించమని చెప్పడం తగదని పేర్కొన్నారు. పండుగ పూట తమందర్ని తీసుకుని జైల్లో పెట్టండనీ సవాల్ చేశారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


