Government Ayurveda Hospital : ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిర్మాణానికి భూమి పూజ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 14: నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం సర్వాయపాలెం గ్రామంలో నూతనంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి , ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది, ఆయుష్ శాఖ డైరెక్టర్ ఎం. దినేష్ కుమార్, ఏ .పి. ఎం. ఎస్ .ఐ .సి .డి, నెల్లూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మల కుమార్ , సూచనలతో, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ కె. రాజానరసింహం ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామానికి ఆయుర్వేద వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ వైద్యశాల ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుళ్లూరు వెంకట వెంకట రమణయ్య ఉప్పాల వెంకయ్య , ఉప్పాల వెంకట్రావు గుడిపల్లి నారయ్య కేతిరెడ్డి విష్ణుతేజ సందు వెంకయ్య నర్మల మాధవరావు ఇసారపు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Groundbreaking ceremony for construction of government Ayurveda hospital

You cannot copy content of this page

Scroll to Top