జూలై 7, 2026
TRINETHRAM NEWS
people visited Srivari

అభిషేక సేవలోనూ 5 వేల మంది సర్వదర్శన భక్తులకు దర్శనం

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి

A record 79,000 people Visited Srivari : తిరుమల, 2026 మే 22: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అత్యంత సమర్థవంతంగా దర్శన ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.

శుక్రవారం ఉదయం ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైమ్ మేనేజ్మెంట్‌, క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించడంతో దర్శనాల సంఖ్యలో గణనీయమైన వృద్ధి సాధ్యమైందన్నారు.

ప్రతిరోజూ సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 15 వేల మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ ఐదు వేల మంది సర్వదర్శన భక్తులకు దర్శనం కల్పించడం ద్వారా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page