Trinethram News : ఈనెల 24 నుంచి అక్టోబరు 2 వ తేది వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ చైర్మెన్ బిఆర్.నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనం లో పాలకమండలి సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యంగా ఈనెల 24 వ తేదిన రాష్ట్రప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం పై ప్రధానంగా చర్చ. అలాగే ఈనెల 28 వ తేది రాత్రి 7 కీలక ఘట్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ, గరుడ సేవను తిలకించేందుకు లక్ష లాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున దాని కూడా చర్చించనున్నారు. కాగా భక్తులరద్దీకి అనుగుణంగా చేయాల్సిన ముందస్తు జాగ్రత్తల ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మరికొన్ని కీలక అంశాల పై కూడా చర్చించి పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


