Hindutva Army : భారత్ లో ఉన్న పాక్ ప్రేమికులు దేశం విడిచి పోవాలి

TRINETHRAM NEWS

హైందవ సైన్యం ఆధ్వర్యంలో నిరసన

(రాజమహేంద్రవరం :త్రినేత్రం న్యూస్, భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ దేశాన్ని ప్రేమించే వారు దేశం విడిచి పోవాలని హైందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు పెనుగొండ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ గత నెల 22న పెహల్గాంలో భారతదేశీ హిందువులపై జరిపిన అమానుషమైన దాడిని యావత్ ప్రపంచ దేశాలు ఖండిస్తుంటే భారత దేశంలో ఉన్నటువంటి కొందరు పాక్ ప్రేమికులు మాత్రం హిందూమతంపై జరిగిన దాడి కాదని పాకిస్తాన్ కు మద్దతు తెలపడం సమంజసం కాదన్నారు. హిందూదేశంలో ఉంటూ పాకిస్తాన్ ను ప్రేమించేవారు దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండాను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని నిరోధించారు. ఈ కార్యక్రమంలో రవి కుమార్, నాగ భూషణం, రాజు, నరసింహ రాజు, గణేష్, మోహన్, సత్య, ఈశ్వరావు, గజేంద్ర, పలువురు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistan lovers in India

You cannot copy content of this page

Scroll to Top