Machine Training : మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ పేరట,కూటమి కుంభకోణం

TRINETHRAM NEWS

సామర్లకోట: త్రినేత్రం న్యూస్ : రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ పేరిట 230 కోట్లు రూపాయలు కుంభ కోణానికి తెరతీసిందని వైస్సార్సీపీ అయ్యరక విభాగం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.. ఈ మేరకు సామర్లకోట వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భీసీ కార్పోరేషన్ నిధు లతో కుట్టు శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కుట్టు శిక్షణలు ప్రారంభించి. వెనుకబడిన సామాజిక వర్గాల నిధులను లూఠీ చేయడానికి కుట్టు మిషన్ల శిక్షణ నిదర్శనమని అన్నారు… రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది లబ్దిదారులను ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి కుట్టు మిషన్కు 4,వేల 300,రూపాయలు శిక్షణకు .మూడు వేలు చెల్లిస్తున్నారని ఈ విధంగా చూస్తే లక్ష మంది లబ్దిదారులకు రూ.73 కోట్లు ఖర్చు అవుతుందని, అయితే టెండర్లు 230 కోట్లకు ఎలా ఆహ్వానించారని అన్నారు..కేవలం కుట్టుమిషన్లు, శిక్షణ పేరిట.

167 కోట్లు ప్రజాధనాన్ని కూటమి నాయకులు స్వాహ చేస్తున్నారని ఇటువంటి కుంభ కోణాలకు పాల్పడుతూ బీసీలను ఉద్దరిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు కూటమి నేతలు అదర కొట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు..బీసీలపై కపట ప్రేమ నటిస్తూ వారి ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ఇటు వంటి కుంభ కోణాలకు తెరలేపడం ప్రజలు గమనిస్తున్నారని. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా అమరావతి రాజధాని పేరిట సరికొత్త డ్రామాలు ఆడటం, డైవర్షన్ పాలిటిక్స్క నిదర్శనమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉదోగ్యాలు ఇస్తామని, నిరు ద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువత ఓట్లు కొల్లగొట్టారని.

పించన్లు, రేషన్ కార్డు లు, పక్కా ఇళ్ల నిర్మాణం ఎక్కడని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం, పీజురీయింబర్స్మెంట్ లను వెంటనే నిధులు విడుదల చేయాలి ఇంజనీరింగ్, మెడిషన్ వంటి చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాక పోవడంతో అనేక మంది తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.. కుట్టు శిక్షణపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రజాధనంకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టరు కు వినతి పత్రాలు అందజేస్తామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లు ఉబా జాన్ మొజాస్,నెక్కంటి సాయి ప్రసాద్,పట్టణ వైసీపీ అధ్యక్షులు పాగా సురేష్ కుమార్,వైసిపి పట్టణ మహిళ అధ్యక్షురాలు పాలికి కుసుమ చంటిబాబు, కౌన్సిలర్లు, బీసీ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In the name of sewing

You cannot copy content of this page

Scroll to Top