MLA Adireddy Srinivas : నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మా కృషి

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

37వ డివిజన్లో పర్యటన

10వ డివిజన్ తెలుకులవాని పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు పనులు ప్రారంభం
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, నగరంలోని అన్ని ప్రాంతాల కోసం తాము నిత్యం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. స్థానిక 37వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే 10వ డివిజన్ పరిధిలోని తెలుకుల వాని చెరువు పార్కులో సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ. 10 లక్షలతో విద్యుత్ ఏర్పాటు కోసం ఆ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనవసరమైన పనులు కాకుండా ప్రజలకు ఏం అవసరమో ఆ అభివృద్ధి పనులు మాత్రమే చేస్తున్నామన్నారు. గత వైకాపా పాలకుల్లా అరకొర పనులు, ప్రజలు ఇబ్బందిపడేలా అనాలోచిత పనులు కాకుండా పూర్తి ఆలోచనలు, పక్కా ప్రణాళికతో శాశ్వతంగా నిలిచిఉండేలా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.

2027లో జరిగే పుష్కరాల నాటికి నగరం సర్వాంగ సుందరంగా ఉంటుందని, నగరంలో జరిగే పనులన్నీ కూడా పుష్కరాలకు ముందు… పుష్కరాల తరువాత అనే రీతిలో ఉంటాయన్నారు. ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు, వ్యాయామాలు చేసుకునేందుకు నగరంలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్కుల్లో జిమ్ సామాగ్రి, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమృత్ పథకంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లు కేటాయించగా దానిలో రాజమహేంద్రవరం నగరానికి రూ. 200 వేలు మంజూరు చేసిందని తెలిపారు. నగరంలో సుమారు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Our efforts for the

You cannot copy content of this page

Scroll to Top