ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
అనారోగ్యంగా ఉంటే వైద్యులను సంప్రదించండి
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు సూచన, రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ప్రస్తుతం మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) సూచించారు. కోవిడ్‌కు సంబంధించి ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో ఒక ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని, ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు ప్రజలకు అందుబాటులో సిద్ధంగా ఉన్నారని తెలపారు. ప్రజలు భయపడవద్దని, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా ఇండోర్ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని సూచించారు. వేరియంట్ వల్ల వచ్చే చాలా ఇన్ఫెక్షన్లు సాధారణ జలుబు లేదా తేలికపాటి ఫ్లూ లాంటి తేలికపాటి లక్షణాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, కండరాల బలహీనత మరియు కొన్నిసార్లు వికారం వంటి చిన్న కడుపు సమస్యలు వస్తాయని, లక్షణాలు సాధారణంగా నాలుగు నుండి ఐదు రోజుల వరకు ఉంటాయన్నారు. తరచుగా చేతులు కడుక్కోవాలని, ముఖ్యంగా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
పై లక్షణాలు కనిపిస్తే కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు వ్యాపించకుండా ఉండటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా కోవిడ్‌కు సంబంధించి ఐసోలేషన్ వార్డు గురించి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని సూచించగా ఆసుపత్రి ఆవరణలో మలేరియా జోనల్ కార్యాలయం వద్ద మొత్తం 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అనారోగ్యంలో వచ్చే వారికి వెంటనే పరీక్షలు చేసేలా కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని, అనారోగ్యంతో వచ్చే వారికి అలాగే కోవిడ్ అని వైద్య పరీక్షల్లో నిర్దారణ అయిన వారికి వేరువేరుగా వార్డులు ఏర్పాటు చేయాలని వైద్యులకు సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ మాస్కులు అందచేలా చూడాలని, కోవిడ్ పట్ల అందరినీ అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


