లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ ఇన్స్టాలేషన్ సెర్మని వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలోని ఆర్ఆర్ గార్డెన్లో అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ లయన్ అనంతుల శివప్రసాద్ హాజరై మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ సేవలు ఐదు దశాబ్దాలుగా వివిధ రూపాలలో నిరుపేదలకు అండగా సామాజిక బాధ్యతగా చేస్తున్న సేవ కార్యక్రమాలు 320 జి కి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా 25-2026 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వడ్లకొండ ఎల్లప్ప, సెక్రటరీగా ముడతనపల్లి సారయ్య, ట్రెజరర్ గా మారుపాక రాజేంద్ర కుమార్, మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులచే ముఖ్యఅతిథి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూతన కమిటీని జిల్లాలోని లయన్స్ క్లబ్ బాధ్యులు, పలువురు అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి సీనియర్ లయన్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, బంక రామస్వామి, కజాంపురం రాజేందర్ తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, లయన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


