MLA Vegulla Jogeswara Rao : మండపేటలో సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోన సీమ జిల్లా మండపేట, సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఆదేశానుసారం త్వరలో డోర్ టు డోర్ కార్యక్రమం మొదలుకానుందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తిచేసుకున్న సంధర్బంగా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అలాగే సాధించిన విజయాలు, కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రక్రియే డోర్ టు డోర్ కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ ఛార్జ్ లు, యూనిట్, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, మండలపార్టీ అధ్యక్షులు, గ్రామపార్టీ అధ్యక్షులు, కె.ఎస్.ఎస్ సభ్యులు తమ వంతు భాద్యతగా ప్రతీ ఇంటిని సందర్శించి “డోర్ టు డోర్” కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సందర్శించిన ఇళ్లను నమోదు చెయ్యడానికి “మై టీడీపీ” అనే యాప్ ను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు. అనంతరం ఈ యాప్ ను ఉపయోగించే విధానాలను అమలాపురం పార్లమెంట్ కన్వీనర్ పలివెల ప్రకాష్ అందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాల సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర ఎస్.సి కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, మండపేట పట్టణ అధ్యక్షులు మచ్చా నాగు, మండపేట మండల అధ్యక్షులు కర్రి తాతరావు, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, వాదా ప్రసాదరావు, కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు బలవరెడ్డి సత్తిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

First step meeting in

You cannot copy content of this page

Scroll to Top