జూలై 16, 2026
TRINETHRAM NEWS
MLA Nenavath Balu Naik

–దేవరకొండ అభివృద్ధికి మరో ముందడుగు

–నూతన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన … ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..

MLA Nenavath Balu Naik : దేవరకొండ డివిజన్ జూలై 16, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ సంబంధిత అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో స్థల పరిశీలన నిర్వహించారు.

ముందుగా నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణం కోసం ఖిల్లా బజార్‌లోని (పాత బజార్) పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని, అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, నిర్మాణానికి అనువైన ప్రాంతాలపై అధికారులతో చర్చించారు.

అనంతరం పట్టణంలోని ఎమ్మార్వో (తహసీల్దార్) కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, అవసరమైన స్థలం, సౌకర్యాలపై ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, “దేవరకొండ పట్టణంలోని పాత బజారుకు కొత్త కలను సాకారం చేస్తూ, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించే విధంగా ఆధునిక వసతులతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నాం” అని తెలిపారు.

నూతన తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.2 కోట్ల 25 లక్షలు, అలాగే మున్సిపల్ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి రూ.7 కోట్ల 60 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ భవనాల నిర్మాణంతో దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా, ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ స్థల పరిశీలనలో ఎమ్మార్వో, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page