జూలై 17, 2026
TRINETHRAM NEWS
MLA Nenavath Balu Naik

– గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష . ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .

MLA Nenavath Balu Naik : దేవరకొండ. డివిజన్ జూలై 16: త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ , గ్రామీణ నీటిపారుదల శాఖ (RWS) మరియు మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి పరిస్థితి, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా, పైప్‌లైన్ల నిర్వహణ, మోటార్ల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం, లీకేజీల నివారణ, మరమ్మతులు, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు.

వేసవి కాలంతో పాటు ఇతర సమయాల్లో కూడా ప్రజలకు ఎలాంటి మంచినీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు.

అలాగే మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ శాఖకు చెందిన సంబంధిత అధికారులుతదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page