అల్లూరి జిల్లా హుకుంపేట త్రినేత్రం న్యూస్ ఆగస్టు 07 : సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. హుకుంపేట మండల జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు పూర్తిగా అందకపోవడాన్ని అధికారులు గమనించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం శాఖల పనితీరుపై సమీక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


