Silver Oak Saplings : ఉద్యాన పంటలకు ప్రోత్సాహంగా సిల్వర్ ఓక్ మొక్కల పంపిణీ చిట్టం మురళి

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరుకు నియోజవర్గం (అనంతగిరి) త్రినేత్రం న్యూస్. ఆగస్టు 07 : అనంతగిరి మండలంలోని ఎగువ శోభ పంచాయితీలో రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటుగా సిల్వర్ ఓక్ మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఏపీడి) పవన్ ఆధ్వర్యంలో, స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు నర్సమ్మ, రాధమ్మ, టెక్నికల్ అసిస్టెంట్లు ఆనంద్ రావు, రాంచందర్ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించబడింది.
దండబాడు, హెక్ట గుడ, జాముగడ, మార్ధగుడ, కొత్తవలస గ్రామాల రైతులకు మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చిట్టం మురళి మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం” నిధులతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ ఉద్యానవన పంటల ద్వారా అనంతగిరి మండలాన్ని రాష్ట్రంలో ముందు వరుసలోకి తీసుకువచ్చే అవకాశముంది,” అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Silver Oak saplings distribution

You cannot copy content of this page

Scroll to Top