అల్లూరి జిల్లా (అనంతగిరి)త్రినేత్రం న్యూస్ మే 30: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు టూరిస్ట్ డెస్టినేషన్ యోగాంధ్ర కార్యక్రమం కింద ఈరోజు అల్లూరిజిల్లా అనంతగిరి మండలం బొర్రా గుహల వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హాజరయ్యారు.
కార్యక్రమం సందర్భంగా యోగా గురువు సూచనల మేరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యా మాన్ పటేల్, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు యోగాసనాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, “యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఆరోగ్యవంతమైన జీవనశైలికి యోగా అవసరం. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యతను గ్రహించి దాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి” అన్నారు. అలాగే విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే యోగా సాధన చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం ఎంపీపీ శెట్టి నీలవేణి, వైసీపీ అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, బొర్రా సెగ్మెంట్ సూపర్ ఎంపీటీసీ డొనేటి డానియల్, మాజీ జెడ్పిటిసి దూరు గంగన్న దొర, వాలసి గ్రామపంచాయతీ సర్పంచ్ సెంబీ సన్యాసి రావు, లంగుపర్తి సర్పంచ్ జాన్ని సన్యాసి రావు, కోనాపురం సూపర్ సర్పంచ్ సమరెడ్డి రఘునాథ్, వైసీపీ ఉపాధ్యక్షుడు పాడి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం స్థానిక ప్రజలు, యోగాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతంగా నిర్వహించబడింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


