International Tribal Day : మారేడుమిల్లిలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవానికి ప్రబలమైన పిలుపు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్, అరకులోయ ఆగస్టు 07 : 2025 ఆగస్టు 8న మారేడుమిల్లిలో జరగనున్న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఐదవ షెడ్యూల్ ప్రాంత ఆదివాసుల శాశ్వత ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక నియామక చట్టం రూపొందించాలని గత నాలుగున్నర ఏళ్లుగా కృషి చేస్తున్న జేఏసీ, ఈ చట్టాన్ని ఆగస్టు 9న జరగనున్న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపధ్యంలో మారేడుమిల్లిలో ఆగస్టు 8న నిర్వహించనున్న మహాసభకు ఆదివాసులంతా పెద్దఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటాలని జేఏసీ అరకు వ్యాలీ మండల కన్వీనర్ సమడ్డి గోపాలరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కో కన్వీనర్లు బురిడీ ఉపేంద్ర, కిల్లో ఆనంద్, కిల్లో బుద్దు, జర్నీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

International Tribal Day celebration

You cannot copy content of this page

Scroll to Top