MLA Kavya Krishna Reddy : కావలి నియోజక వర్గం అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 20 :నెల్లూరు జిల్లా :కావలి : ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి… కావలి పట్టణం 18వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. 2029 నాటికి కావలి పట్టణానికి బైపాస్ రోడ్ తీసుకొస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బైపాస్ రోడ్డు సంబంధించి డిపిఆర్ ఇచ్చానని, ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కి అందజేశారని చెప్పారు. అందుకు గడ్కారీ కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.. ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది, పరిష్కారం మాది కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని 18వ వార్డులో.. వార్డు ఇంచార్జ్ శానంహరి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా వార్డులోనే ప్రతి గడపకి వెళ్లి స్థానికులను అడిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని బ్యాలెన్స్ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి sc సబ్ ప్లాన్, నుడా ఫండ్స్ కింద 20 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, నిధులు మంజూరు అయితే వెంటనే పనులు ప్రారంభించిత్వరితగతను
పూర్తిచేసిప్రజలకుఅందుబాటులోకితెస్తామన్నారు.అలాగే కావలి ప్రజల దాహార్తి తీర్చేందుకు విజన్ తో ముందుకు వెళ్తున్నాం అన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో అమృత్1పథకాన్ని నీరుగార్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమృత్ 2 పథకంకోసం38 కోట్లు కేటాయిస్తోందని,ఆ నిధులతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి పురపాలక శాఖమంత్రి పొంగూరునారాయణ సంప్రదించాలని,32 కోట్లునిధులు మంజూరు చేశారని,ఇప్పటికే టెండర్లు కూడా పిలిచామని కాదు కృష్ణారెడ్డి తెలిపారు.ఏడాదిన్నర కాలంలోనే కావలిపట్టణాభివృద్ధి కోసం 160 కోట్లునిధులు వెచ్చించామనిఆయన గుర్తు చేశారు.కావలి పట్టణం నుంచి మద్దూరుపాడు వరకు ఫోర్ లైన్స్ రోడ్డు పూర్తయిందని,సెంట్రల్ లైటింగ్ పనులు మిగిలి ఉన్నాయని,అవి కూడా పూర్తయితే త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు.జనవరి తర్వాత నుంచి ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు విస్తరిస్తామని వారి స్థితిగతులను కూడా తెలుసుకుని సమస్యనుకూడాపరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వానికి, తనకు వేసిన ఓటు వృధా కానివ్వబోనని చెప్పారు. జవాబుదారీతనానికి నిదర్శనంగా కావలి ఎమ్మెల్యే ఉంటారని.. ప్రజలు చెప్పుకునేలా
మెచ్చుకునేలాపని చేస్తానని కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు,ఈ కార్యక్రమంలో కావలి కమిషనర్ జి.శ్రావణ కుమార్,ఎమ్మార్వో శ్రావణ్ కుమార్,టిడిపి పట్టణ అధ్యక్షులుగుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,సోమశిలమాజీ చైర్మన్,కండ్లగుంట మధుబాబు నాయుడు,టిడిపి రాష్ట్ర నాయకులుమొగిలి కల్లయ్య,18వ వార్డు ఇంచార్జ్ శానంహరి,19వ ఇంచార్జ్ ఏగూరి చంద్రశేఖర్,26వ టిడిపి ఇంచార్జ్ గంగినేని వెంకటేశ్వర్లునాయుడు,టి.డి.పి ,సీనియర్ నాయకులు తిరువీధి ప్రసాద్,పట్టణ మహిళా అధ్యక్షురాలుఅర్షియా బేగం , జనసేన పట్టణఅధ్యక్షులు బొబ్బ సాయిబిజెపి నాయకులు చిట్టిబాబు,మాల్యాద్రి,టిడిపి నాయకులు షేక్ హజరత్, మాజీ కౌన్సిలర్ మస్తాన్,దావులూరి దేవ కుమార్ , ఏఎంసీ డైరెక్టర్ మొగిలి విజయ్ కుమార్,వల్లేరి కిరణ్ కుమార్ , షేక్ అలహర్, అక్కలిగుంట సూర్యప్రకాష్ ,వార్డు అధ్యక్షుడు పోలిశెట్టి మాలకొండయ్య, ఉపాధ్యక్షుడు షేక్ సుల్తాన్, బూత్ కన్వీనర్లు, సుభాని, సుబ్రహ్మణ్యం, పఠాన్ గౌస్, గొట్టిపాటి రాము,కందేటి వేణుగోపాల్, పబ్బిశెట్టి రంగయ్య, అంబటి శ్రీనివాసులు,జాతికీర్తి శంకర్, శివలింగం వెంకటేశ్వర్లు, శివలింగం వేడుకొండలు,ముద్ర కొలను మాల్యాద్రి, నీలి శెట్టి రమణయ్య, షేక్ జలీలు, షేక్ రాహుల్, షేక్ విక్రమ్,షేక్ బాబు, పొంతగాని వేణుగోపాల్,పొంత గాని హరి, గ్రామ సచివాలయం అధికారులు అన్ని శాఖల అధికారులు, తదితరులు భారీగా పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA leading Kavali constituency towards development

You cannot copy content of this page

Scroll to Top