Jagan’s Birthday : జగన్ పుట్టినరోజు ప్రజలందరికీ పండుగే

TRINETHRAM NEWS
  • ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • గోదావరి మధ్య ఇసుక తిన్నెలలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు
  • జగన్ అభిమాని యువజన విభాగం నాయకులు కంటే వినయ్ తేజా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
  • పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

త్రినేత్రం న్యూస్… రాజమహేంద్రవరం, : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజానగరం నియోజవర్గం మధురపూడి గ్రామానికి చెందిన కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని అన్నారు. ఆయన పాలన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అనేకమంది ఆంధ్రప్రదేశ్ వైపు చూపులు చూసే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతు భరోసా తదితర పథకాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

తండ్రి ఆశయాలు ముందుకు తీసుకు వెళ్ళేందుకే రాజకీయాల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారని అన్నారు. సంక్షేమ అభివృద్ధి జోడు గుర్రాల మాదిరిగా పాలన సాగించారని అన్నారు. అనేక సంస్కరణ తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు 5 సంవత్సరాలు కాలంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి మేలు చేకూర్చారని వివరించారు. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గొప్ప కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఆ అభిమానంతోనే కంటే వినయ్ తేజ ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో గోదావరి నది లో అనేక వ్యయప్రయాసలకోర్చి గోదావరి నది మధ్యలో జన్మదిన వేడుకలు నిర్వహించారని తెలిపారు. జగన్ కు ఆయురారోగ్యాలతో శక్తి సామర్థ్యాలతో ప్రజలకు మరింత మేలు చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కంటే వినయ్ తేజ మాట్లాడుతూ గోదావరి ప్రజలకు మమకారం, ఎటకారం ఎక్కువ అని అన్నారు. అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రేమ చూపించాలని ఉద్దేశంతో గోదావరి నది జలాల మధ్యలో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అభివృద్ది సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమని అన్నారు. మెట్ట ప్రాంత రైతులకు మేలు చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. మెట్ట ప్రాంత రైతులు చిరిగిపోయిన చొక్కాల తో తమ తాతలు, తండ్రులు ఉండేవారని, ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉన్నామంటే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం పేరుతో మెట్ట ప్రాంత రైతులకు త్రాగు, సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. జక్కంపూడి రాజా తమ ఆరాధ్య దైవం అని ఆయనకు ఆరోగ్య దైవం అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు . ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని పేర్కొన్నారు. జగన్ జన్మదిన వేడుకలలో సుమారు 200 మంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jagan's birthday is a festival for all people

You cannot copy content of this page

Scroll to Top