MLA Kavya Krishna Reddy : పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్20: నెల్లూరు జిల్లా: కావలి… శాసన సభ్యులు..కృష్ణారెడ్డి… మనందరం బాధ్యతగా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణపై దృష్టి సారించిన ప్రభుత్వ ప్రణాళిక బద్ధంగా తీసుకొని ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో శనివారం కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 18 వ వార్డులో స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , హాజరయ్యారు. పచ్చ జెండా ఊపి స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులు, నాయకులు, ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని మనతోపాటు మన రాష్ట్రం కూడా స్వర్ణాంధ్రత ఉంటుందన్నారు. కాలుష్యాన్ని నివారించుకునేందుకు మొక్కలు నాటడం కూడా మన బాధ్యత అన్నారు. మనం పర్యావరణాన్ని సంరక్షించుకుంటే కాలుష్యాన్ని నివారించవచ్చునని అన్నార

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's protect the environment

You cannot copy content of this page

Scroll to Top