త్రినేత్రం న్యూస్: జనవరి 12: నెల్లూరు జిల్లా : కావలి :నియోజకవర్గ ఇంచార్జి , అళహరి సుధాకర్ , కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికుల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా , అళహరి సుధాకర్ , మాట్లాడుతూ, ఇటీవల ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు , పవన్ కళ్యాణ్ కావలి ఎమ్మెల్యే , కలిసి, కావలి నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో మూడు రోడ్లకు అనుమతులు కోరగా, వాటిని తక్షణమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ కి, కృతజ్ఞతలు తెలిపారు, కావలి జనసేన పార్టీ తరపున నేను కూడా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరగిందని తెలిపారు. ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన పార్టీకి రావాల్సిన వాటా ప్రకారం గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ ఎన్నికలలో సీట్ల కేటాయింపు జరగాలని, జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


