త్రినేత్రం న్యూస్, పారిశుద్ధ కార్మికుల సేవలకు వెలకట్టలేని, గ్రామాలు పట్టణాలకు వీరు చేస్తున్న, సేవల వల్లే ఆరోగ్యంగా ఉంటున్నామని స్వచ్ఛంద స్వచ్ఛభారత్ మిషన్ విజయవంతం అవుతున్నాయని, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ అన్నారు.
కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన, ఎనిమిది మంది పరిశుద్ధ కార్మికులకు, తన సొంత డబ్బుతో, నూతన వస్త్రాలు, నగదు ఫలాలతో, మురమండ గ్రామపంచాయతీ వద్ద, ఘనంగా సత్కరించారు. ఊరు నిద్ర లేవక ముందే, గ్రామాన్ని శుభ్రం చేస్తూ, గ్రామానికి మంచి పేరు తెస్తున్నారని, గ్రామ సర్పంచ్, అయినవిల్లి రుక్మిణి, వెంకటేశ్వర్లు అన్నారు.
ఒక రోజు వారు పని చేయకపోతే, మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించమన్నారు. మురమండ గ్రామం, సహకార బ్యాంక్ అధ్యక్షులు, వట్టికుట్టి జానకిరామయ్య, ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్మికుల వారిని వారి సేవలను గౌరవించాలని అన్నారు. ఎంపీటీసీ, మెల్లిమీ గంగరాజు, మాట్లాడుతూ, పరిశుద్ధ కార్మికులకు, ప్రభుత్వాలు ప్రజలు సహకారాలు అందించాలని, కోరారు.
గ్రామ టిడిపి అధ్యక్షులు, దేవుళ్ళ మోహన్ రావు, (రాంబాబు), పంచాయతీ కార్యదర్శి దూడల రాఘవ, ఉప సర్పంచ్ , ఎర్రంశెట్టి వీరబాబు, ముంగమూరి చినబాబు, తూలూరి శేషు, గొల్లపల్లి వీర సత్యనారాయణ, కార్మిక సేవలను, కొనియాడారు. టిడిపి జిల్లా ప్రతినిధి పత్తిపాటి రామారావు చౌదరి, తూలూరి రవి, పొలమాటి భాస్కర్, ఏ శశిధర్, తూలూరి రాజు, పంచాయతీ సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


