
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యం
MLA Bandaru : త్రినేత్రం న్యూస్ : ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు పేర్కొన్నారు. సోమవారం ఆలమూరు మండలం గుమ్మిలేరులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారిరువురు కలిసి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి పింఛన్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ దేశంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనే 41,656 మందికి సామాజిక, ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి రూ.18.30కోట్ల రూపాయలు (18,30,88000) పంపిణీ జరుగుతుందన్నారు.పింఛన్ల పంపిణీతో పేదల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు.
జొన్నాడ ఫ్లైఓవర్ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరాం..
జొన్నాడ ఫ్లైఓవర్ పనులు ఆలస్యం కావడం తీవ్ర బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. పనుల జాప్యంపై అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ జొన్నాడ ఫ్లైఓవర్ పనుల గురించి ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, జాతీయ రహదారి ఉన్నతాధికారుల తో మాట్లాడటం జరిగిందన్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ పనులను రద్దుచేసి, కొత్త టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని కోరామన్నారు.
ఈ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.తక్షణమే సర్వీస్ రోడ్లను మంజూరు చేసి,వెంటనే నిర్మించాల్సిందిగా కోరామన్నారు. త్వరలోనే ఈ పనులన్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రావులపాలెంలో ఆక్రమణల తొలగింపు తర్వాత సర్వీస్ రోడ్లు,డ్రైన్లు నిర్మాణం చేయాలని కోరామన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
