MP Harish : ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలి

TRINETHRAM NEWS

రైల్వే హల్ట్ కు బిజెపి విజ్ఞప్తి…
ఎంపి హరీష్ కు వినతిపత్రం…

మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కు అమలాపురం లో సోమవారం వినతి పత్రాన్ని అందజేసినట్లు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ పేర్కొన్నారు. ద్వారపూడి రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు కు హాల్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమలాపురం లోని బిజెపి నేత నల్లా పవన్ కుమార్ స్వగృహం లో పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాదుర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొన సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఏకైక రైల్వేస్టేషన్ ద్వారపూడి స్టేషన్ అన్నారు. రామచంద్రపురం, మండపేట నియోజక వర్గాలు తో పాటు చుట్టుపక్కల సుమారు 45 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. ఈ రైల్వేస్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.రైల్వే స్టేషన్ లో నూతన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. రత్నచల్, జన్మభూమి, షిరిడి సాయి , గోదావరి ఎక్స్ప్రెస్ రైలు హాల్టు లు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీ గంటి హరీష్ మధుర్ తాను ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సమస్యలు తెలుసుకునేందుకు విచ్చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ,బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు, మండపేట నియోజకవర్గం బిజెపి కోకన్వీనర్ కంకటాల మురళీకృష్ణ, జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు చాట్రాతి జానకి రాంబాబు, ద్వారపూడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చింత దొరబాబు ,నరాల రాంబాబు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Facilities should be provided

You cannot copy content of this page

Scroll to Top