MLA Bandaru Satyananda Rao : పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు

సుపరిపాలనలో తొలి అడుగుకు వస్తున్న ఆదరణతో వైసిపి నాయకులు బెంబేలెత్తుతున్నారు…

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆలమూరు మండలం గుమ్మిలేరు, మోదుకూరు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్య శ్రామికుడని వ్యాఖ్యానించారు. సుపరిపాలన– తొలి అడుగుకార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని అభిప్రాయపడ్డారు. నాటి వైసిపి పాలనలో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొని ఉండేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని బండారు వ్యాఖ్యానించారు. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని, తమకు భవిష్యత్తు లేదని గ్రహించి వైసిపి నాయకులు అసత్యాలు, అబద్ధాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అన్నదాత సుఖీభవ ఈ నెలలో అమలవుతుందని, ఆగస్టు 15న చెల్లెమ్మలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలులోకి వస్తున్నందున వైసీపీ నేతలు ముందుగానే బస్సులెక్కి అబద్ధాలు ప్రచారాలుకు శ్రీకారం చుట్టారన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి మరో నాలుగేళ్లలో జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A working government is

You cannot copy content of this page

Scroll to Top