జూన్ 26, 2026
TRINETHRAM NEWS
MLA Amilineni Coalition government stands

అడిగిన వెంటనే మా నాయకుడు ముఖ్యమంత్రి సహాయనిది అందిస్తున్నారు…
రెండు బోర్లు వేయించి నీటి సమస్య పరిష్కారం

గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చూస్తాం, గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తాం.. మర్రిస్వామి కొండకు దారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం

ప్రజా ధర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడమే మా ముందున్న లక్యం

MLA Amilineni : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గొప్ప మనసున్న మనిషని ఎక్కడా కూడా పేద ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో మేము ఇక్కడ నుంచి పంపే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వెనక్కి పంపకుండా ముఖ్యమంత్రి సహాయనిది అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కి దక్కుతుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. అంతే కాకుండా లెటర్ అఫ్ క్రెడిట్ ద్వారా నేరుగా పూర్తి ఖర్చు ప్రభుత్వం భరించేలా ముందస్తుగా ఇస్తూ ప్రజలను ఆదుకుంటోందని అన్నారు..

అందులో భాగంగానే శెట్టూరు మండలం యరబోరెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, మండల పార్టీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా 11మంది బాధితులకు దాదాపు 12.42 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు..గత ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన ఉషా శ్రీ చరణ్, ఎంపీగా పవనిచేసిన రంగయ్య కానీ గ్రామాల్లో పర్యటించకుండా కనీసం కొన్ని గ్రామాల్లో అయినా మౌళిక వసతులు కల్పించకుండా విస్మరించారని, అదే కాకుండా బీటీపీ కాలువ పనులను పక్కన పెట్టి ఇటు రైతులును గాలికి వదిలేశారని, ప్రతి గ్రామం అభివృద్ధి చేయడం కోసం నిరంతరం పనిచేస్తామని, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు, సీసీ రహదారులు, మౌళిక వసతులు కల్పించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు..

అంతే కాకుండా రెండు రోజుల క్రితం పంచాయతీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది అని గ్రామస్థులు తెలియజేయడంతో వెంటనే రెండు బోర్లు వేయించామని పుష్కళంగా నీళ్లు పడటం చాలా సంతోషమని, గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేలా డీఎమ్ తో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు..మర్రిస్వామి కొండకు దారి నిర్మాణం కోసం మా సిబ్బందిని పంపి ఎలా వేయడానికి కుదురుతుంది పరిశీలిస్తామని తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page