జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Minister Atchannaidu urious at YCP

Minister Atchannaidu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ ; జూన్ 04; వెన్నుపోటుకు రెండేళ్లు కాదు,వైసీపి రాక్షస పాలన విముక్తికి రెండేళ్లు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెండు వేల, ఇరవై నాలుగు వఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీకి చరమగీతం పాడారు తెలిపారు. వైసీపీ నిరసనలు ప్రజల తీర్పును అవమానించే చర్య లా ఉందని సూచించారు. గత ప్రభుత్వం జగన్ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు , ప్రజలు భయంతో జీవించారు అని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిన పార్టీ వైసీపీ , ప్రజల మధ్య తిరగని జగన్ నేడు ప్రజల గురించి మాట్లాడటం విడ్డూరం అని ఎద్దేవా చేశారు.

పరదాల చాటున పాలన చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదు, రైతులు, యువత, మహిళలను వైసీపీ మోసం చేసింది అని గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకున్న ఐదేళ్లు వైసీపీ పాలన ,ప్రతీకార రాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరు అని వ్యాఖ్యానించారు. పరిశ్రమలను తరిమేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు, ప్రజల తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు ముగిసిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంటే, ఓర్చుకోలేని వైసీపీ పనిగట్టుకొని అబద్ధపు ప్రచారాలు చేస్తుందని అవి తగ్గించుకుంటే మంచిదని వివరించారు. గత ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో మోసమే జరిగింది అని అన్నారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది అని సంతోషం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page