జూలై 28, 2026
TRINETHRAM NEWS
Door-to-Door Campaign

Door-to-Door Campaign : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 27; నూజివీడు నియోజకవర్గం, మండలం, పట్టణం 8వ వార్డులో “రెండేళ్ల నమ్మకం , అభివృద్ధి సంక్షేమం ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుని మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజల విశ్వాసమే మా బలం, ప్రజాసేవే మా ధ్యేయం అని అన్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page