CPI Party : ఆగస్టు 19 నుండి 22 వరకు జరిగే సి పి ఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చెయ్యండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 21 ధర్మసాగర్ :హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లో ధర్మసాగర్ మండల సీ పి ఐ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి మాట్లాడుతూ వచ్చే ఆగష్టు 19 నుండి 22 వరకు సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రం లో అనేక ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టల పూర్తి కేంద్ర ప్రభుతం రాష్ట్ర విభజన సమయం లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అందులో ముఖ్యమైనివి కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ ములుగు గిరిజన యూనివార్సిటీ ఇలాగ రాష్ట్రనికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం వలన ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోసం దేశం విడిచి వలస వెల్సిన పరిస్థితి వచ్చింది అని గత బి ర్ స్ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు పరిశ్రమల కారిడోర్ ఏర్పాటు చేస్తామని ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరుద్యోగ యువత కు మేలు జరగలేదు అలాగే

ఆరు గారింటిల అమలు లో పూర్తి గా విఫలం అయ్యారు మహా లక్ష్మి పథకం ప్రతి గృహిణి 2500 ఇస్తామని కల్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇస్తామని ప్రజలను మోసం చేసారు రైతుల పంటలకు దేవదుల ప్రాజెక్టు ద్వారా ఉత్తర క్యానల్ కు నీళ్లు ఇచ్చి దక్షిణ క్యానల్ నీరు విడుదల చెయ్యకపోవడం తో ఎంతో మంది రైతుల పంటలు ఎండి పోతున్నాయి కూలీల సమస్యల గురించి ఆలోచన లేదు యూరియా కొరత వలన సరియైన సమయం లో యూరియా రైతులకు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు తెలంగాణ ఉద్యమ కారులను ఆదుకోవాలని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సభలు ఏర్పాటు చేసి ఈ అంశాలు పై సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని అని అన్నారు ఈ సమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రా బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మద్దెల యెల్లెశం, జిల్లా కార్యవర్గ సభ్యులు మునిగల బిక్షపతి, కర్రె బిక్షపతి, అశోక్ స్టాలిన్, ధర్మసాగర్ మండల కార్యదర్శి కొట్టే వెంకటేశం, జిల్లా సమితి సభ్యులు శంకర్ నాయక్,గ్రామ శాఖ కార్యదర్శి చిలుక బాబు,మండల సభ్యులు బండి రత్తమ్మ, సింగారపు కొమురయ్య,కొట్టే లింగయ్య, వల్లపు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the CPI state

You cannot copy content of this page

Scroll to Top