
Awareness Crop Protection : డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 08, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం పత్తి, వరి ప్రధాన పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాములమ్మ మేడమ్ రైతులతో పత్తి, వరి పంటల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పురుగు, తెగుళ్ల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా వరి, పత్తి పంటల్లో నల్లి వంటి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, అవసరమైన పురుగుమందుల ఎంపిక, పిచికారీ విధానాలపై రైతులకు వివరించారు.
అలాగే రాబోయే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరితో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తూ, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించారు.
రైతులు తమ పొలాల్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురాగా, వాటిపై డాక్టర్ రాములమ్మ సమాధానాలు, తగిన సూచనలు అందించారు. అనంతరం పత్తి, వరి పంటల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు క్షేత్ర సందర్శన కూడా నిర్వహించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు, కేవీకే శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe