అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Tribal Women Association

Demudamma Visits Pinakota PHC : అనంతగిరి, అక్టోబర్ 9, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు దీసరి దేముడమ్మ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ హేమంత్‌తో ఆమె భేటీ అయ్యారు. పినకోట పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వైద్య సిబ్బంది పూర్తి సమయం అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పీహెచ్‌సీలో అన్ని రకాల అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డాక్టర్ హేమంత్‌ను కోరారు. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని దీసరి దేముడమ్మ సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page