Senior Journalists : టీయూడబ్ల్యూజే ఐజేయు పెద్దపల్లి జిల్లా కమిటీలో ఖని సీనియర్ జర్నలిస్టులకు చోటు

TRINETHRAM NEWS

జిల్లా ఎథిక్స్ కమిటీ కో కన్వీనర్ గా పందిళ్ల శ్యాంసుందర్ కె ఎస్ వాసు
కార్యవర్గ సభ్యులుగా దబ్బెట శంకర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే, ఐజేయు జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. సమావేశానంతరం యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్లావర్జుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు అశోక్ జిల్లా కమిటీలను ప్రకటించడం జరిగింది.

ఈ కమిటీలలో గోదావరిఖని కి చెందిన సీనియర్ జర్నలిస్టులు పందిళ్ళ శ్యాంసుందర్, కె ఎస్ వాసు లను జిల్లా ఎథిక్స్ కమిటీ కో కన్వీనర్లు గా ఎన్నుకున్నారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా దబ్బెట శంకర్ ను నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ టి యూ డబ్ల్యూ జే, ఐ జేయు పెద్దపల్లి జిల్లా కమిటీ లో నియమించినందుకు జిల్లా అధ్యక్షులు మల్లావర్జుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ తో పాటు జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Senior journalists from Khani

You cannot copy content of this page

Scroll to Top