Road Repair work: మక్త కు మహర్థశ రోడ్డు మరమత్తు పనులు

TRINETHRAM NEWS

లాల్ సింగ్ తండా నుండి మక్త వరకు మట్టి రోడ్డు పనులు

ఉప్పరి గడ్డ సర్పంచ్ చందు నాయక్ పై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

త్రినేత్రం న్యూస్/ షాద్నగర్ ప్రతినిధి… పవిత్ర రంజాన్ మాంసం పురస్కరించుకొని లాల్ సింగ్ తండా నుండి మక్త వరకు మట్టి రోడ్డు పనులు చేపట్టినట్లు ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ సర్పంచ్ చందు నాయక్ తెలిపారు. మంగళవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ లో ఉన్న లాల్ సింగ్ తండా నుండి మక్త వరకు సిసి రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయడంతో పాటు మక్త వరకు మట్టి రోడ్డును చదును చేయించి రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేశారు.

లాల్ సింగ్ తండా నుండి మక్త వరకు రోడ్డుకు మరమత్తులు చేయడంతో ప్రజలు సర్పంచ్ చందు నాయక్ పని తీరుపై హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుండి లాల్ సింగ్ తండా నుండి మక్తకు వెళ్లే మట్టి రోడ్డు అద్వానంగా ఉందని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, దాంతో ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ వెనువెంటనే ఆలోచించకుండా జెసిబి యంత్రాలతో రోడ్డును చదును చేయించి ట్రాక్టర్లతో మట్టి పోయించి రాకపోకలు కొనసాగించారు.

దాంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ప్రతి ముస్లిం మక్త కు వెళ్లి ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మరమత్తు పనులు చేయడంతో సర్పంచును ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గ్రామపంచాయతీలో ఏ సమస్యలు ఉన్న నేనున్నానంటూ సర్పంచ్ తన సొంత ఖర్చులతో పనులు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ప్రజలు తెలియజేశారు. మున్ముందు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maharthasha road repair work for Makta

You cannot copy content of this page

Scroll to Top