Darshan Begins : శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

TRINETHRAM NEWS

ముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం

రాత్రి 8.30 నుండి య‌ధావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌

Trinethram News : తిరుమల, 2026 మార్చి 03: శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉదయం 9 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూశారు.

దాదాపు 10.30 గంట‌ల అనంత‌రం మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం

చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా మంగళవారం ఉదయం 9 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Darshan begins at Srivari Temp

You cannot copy content of this page

Scroll to Top