Mon. Mar 9th, 2026

Dr. Pitta Vara Prasad : కామాంధుడికి ఉరిశిక్ష విధించాలి

TRINETHRAM NEWS

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్)
రాష్ట్ర అధ్యక్షులు డా. పిట్టా వర ప్రసాద్

త్రినేత్రం న్యూస్ … ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణంలో ఆరు సంవత్సరాల పసి బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన మానవత్వానికే మచ్చ. ఈ అమానుషానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్‌పై వెంటనే అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్ర అధ్యక్షులు డా. పిట్టా వర ప్రసాద్ గట్టిగా డిమాండ్ చేశారు.

పసిబాలికల భద్రతను కాపాడలేని పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు స్వేచ్ఛగా లభ్యమవుతుండటమే ఇటువంటి పాశవిక నేరాలకు దారితీస్తోంది. గంజాయి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం ఈ ఘటనతో స్పష్టమైందన్నారు.

మా కఠిన డిమాండ్లు: నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి ఉరిశిక్ష విధించాలన్నారు. బాధిత కుటుంబానికి కనీసం రూ. 1 కోటి ఆర్థిక సాయం మరియు ఒక కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.

మదనపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి 30 రోజుల్లో పూర్తి నివేదిక విడుదల చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. డా. పిట్టా వర ప్రసాద్ హెచ్చరిక … “పసిపాపల ప్రాణాలకు హాని కలిగే పరిస్థితి కొనసాగితే ప్రజలు సహించరన్నారు .

గంజాయి నియంత్రణలో నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తోందని,ఇకనైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందన్నారు

బాధిత కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kamandha should be given death penalty

Related Post

You cannot copy content of this page