Farmers Awareness : సేంద్రియ ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన

TRINETHRAM NEWS

జీడి నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ త్రినేత్రం న్యూస్. పెనుమూరులో బుధవారం మన గ్రోమోర్ సెంటర్ నందు సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమo గ్రోమోర్ ఆర్ఎస్ఎం చంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం వల్ల ఖర్చులు తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుందని అన్నారు. మన గ్రోమోర్ సెంటర్ నందు అన్ని రకములైన సేంద్రియ ఎరువులు సరసమైన ధరలకే రైతులకు అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలోరైతులు,గోపిరెడ్డి, ఈశ్వర్ నాయుడు, చంద్రశేఖర్, త్యాగరాజులు మొదలగు రైతులు పాల్గొన్నారు. అలాగే సేంద్రియ పద్ధతులలో సాగుచేసిన రైతులను గ్రోమోర్ సెంటర్ వాళ్ళు సత్కరించారు. తర్వాత కేక్ కట్ చేసే రైతులకు పంచిపెట్టారు. ఇందులో ఎఫ్ ఎస్ ఏ పవన్ కుమార్,అకౌంటెంట్ రాజేష్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farmers awareness on the use of organic fertilizers

You cannot copy content of this page

Scroll to Top