INTUC Leaders meet Sanjeeva Reddy : సంజీవరెడ్డిని కలిసిన ఐఎన్‌టియుసి నాయకుల బృందం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం : ఐఎన్‌టియుసి అఖిల భారత అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు జి.సత్యజిత్‌ రెడ్డి ఎపిఎస్‌ఎస్‌ఇఇ 327 యూనియన్‌ డైరీ ఆవిష్కరణకు విజయవాడ విచ్చేసారు.

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు వాసంశెట్టి గంగాధరరావు, ఐఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి (ఓఎన్‌జిసి) టి.నారాయణరావు, ఇటీవల రాజమండ్రి అర్బన్‌ ఐఎన్‌టియుసి అధ్యక్షలుగా నియమితులైన ఎం.శివకుమార్‌ గౌడ్‌, కోస్టల్‌ పేపర్స్‌ యూనియన్‌ అధ్యక్షలు జి.సాయిబాబా, ఐటీసీ యూనియన్‌ చిక్కాల శ్రీనివాస్‌, క్వారీ లారీ యూనియన్‌ అధ్యక్షలు తిరగటి రమణ, ప్రధాన కార్యదర్శి పోడి పాపారావు, ఉపాధ్యక్షలు ఏసుబాబు, న్యాయ సలహాదారులు చిలక డివి ప్రసాద్‌, సురేష్‌ తదితరులు వారిని మర్యాద పూర్వకంగా కలిసారు.

ఆల్‌ ఇండియా ఐఎఎన్‌టియుసి అధ్యక్షులు జి.సంజీవరెడ్డి చేతుల మీదుగా కోస్టల్‌ పేపర్స్‌ యూనియన్‌ ఐ ఎన్‌ టి యు సి కి రిజిస్టర్డ్‌ అనుబంధపత్రం అందచేయడం జరిగింది. ఐఎన్‌టియుసి బలోపేతంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పలు అంశాలపై చర్చలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్‌, ఆంధ్ర, తెలంగాణ ఐ ఎన్‌ టి యు సి ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

INTUC leaders meet Sanjeeva Reddy

You cannot copy content of this page

Scroll to Top