
Intensive Revision Program : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 04; రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గం, పట్టణం ఆర్కె మినీ ఫంక్షన్ హాల్‌లో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ , నియోజకవర్గ పరిశీలకులు మరియు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్స్ యు రివిజన్ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత, ఓటరు జాబితా సవరణలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గంలోని మండల, పట్టణ, గ్రామ ఆ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ మరియు బూత్ ఇంచార్జ్‌లు, బి ఎల్ ఏలు, నీటి సంఘాల అధ్యక్షులు మరియు సభ్యులు, కే ఎస్ ఎస్ సభ్యులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీటీసీలు, పంచాయతీ మాజీ సర్పంచులు, పిఎసిఎస్ చైర్మన్ లు సభ్యులు, వార్డు సభ్యులు, దేవాదాయ శాఖలో పదవులు పొందిన చైర్మన్ లు మరియు సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో వివిధ హోదాల్లో పదవులు నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్యక్రమం విజయవంతంగా సాగగా, పార్టీ శ్రేణులు ఆ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
