తేదీ : 28/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం , ధర్మాజీగూడెంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన పంట పొలాలను సందర్శించారు. ఇంటింటికి వెళ్లి రైతులను కలుసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మంజూరు చేసినటువంటి అన్నదాత సుఖీభవ పథకం వ్యవసాయంలో పంచ సూత్రాలు మరియు వాటి ఆవశ్యకతను వివరించారు. నీటి భద్రతతో సమర్థవంతమైన నిర్వహణ, బిందు సేద్యనికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


