జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Review on development

Review on Development : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 04; గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావులేకుండా పనుల వేగం పెంచాలని, అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించాలని తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page