Indira Sakthi Canteen : ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ లబ్ధిదారులు 126 డివిజన్ జగద్గిరిగుట్ట వాసులు ఉమ ఏర్పాటు చేసుకున్న క్యాంటీన్ ను ప్రారంభించిన గాజులరామారం సర్కిల్ కమీషనర్ మల్ల రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి .

అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ …. లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి, ఆర్థికంగా స్వతంత్రంగా మారేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం, మహిళల సాధికారత మరియు ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం, మహిళా సాధికారత కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఒకటి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, సంజీవ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సోమన్నా శ్రీధర్ రెడ్డి, గణేష్, రవీందర్, శ్రీనివాస్ చారి , కయ్యుమ్, రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indira Sakthi Canteen opening

You cannot copy content of this page

Scroll to Top