Trinethram News : ఎటువంటి ప్రజాభిప్రాయం లేకుండా శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరంలోని తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో మోస్ట్ లివబుల్ సిటీగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకొని శరవేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక వెనుకబడింది.
ప్రభుత్వము హైదరాబాద్ నగరాన్ని తమ ఖజానా నింపే బంగారు బాతుగానే చూస్తున్నారు. కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో ఎటువంటి చర్యలు చేపట్టక ఘోరంగా విఫలమైంది.
జిహెచ్ఎంసి పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు చేపడుతున్నట్లు తీసుకున్న నిర్ణయములో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, అర్థరహితమని అర్థమవుతుంది.
గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో 2000 – 2016 ఇష్టం వచ్చినట్లు మున్సిపాలిటీలను విలీనం చేసి తప్పు చేసింది. ఇష్టం వచ్చినట్టు మున్సిపాలిటీలను ఏర్పాటుచేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేక ఘోరంగా విఫలమైంది.
గత కాంగ్రెస్ పాలనలో 15 రోజులకు ఒకసారి మంచి మీరు సరఫరాతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కంకణ బద్ధులై గోదావరి జలాలను నగరానికి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కెసిఆర్ కి, కేటీఆర్ గార్ల కే దక్కుతుంది.
2016 లో మౌలిక వసతుల కల్పనలో, శాంతిభద్రతల అదుపుతో చక్కటి నగరంగా హైదరాబాద్ నగరం గుర్తింపు తెచ్చుకుంది.
గత కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో చేసిన తప్పులను మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరి చేసుకుంటూ వచ్చాం, మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. మళ్లీ రానున్న మా ప్రభుత్వంలో మళ్ళీ మేమే సరి చేసుకుంటూ రావాలా…?
శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో కలపడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, శివారు మున్సిపాలిటీల విలీనం ద్వారా అధిక పన్ను వసూలు చేపట్టి ఎలా ప్రజల నుంచి డబ్బులు దండుకోవాలా…? ఎలా ఢిల్లీకి పంపించాలా అనే దురాలోచన తప్పితే ప్రజలకు మేలు చేస్తారన్న ఆలోచన లేదు.
పరిపాలనా సౌలభ్యం కోసం పది కార్పొరేషన్లను, 17 మున్సిపాలిటీలను ఏర్పాటుచేసిన ఘనత బిఆర్ఎస్ కే దక్కుతుంది.
శివారు మున్సిపాలిటీలు హైదరాబాదులో విలీనం చేయడం పూర్తి అశాస్త్రీయం. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయం తీసుకోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ వ్యతిరేక నిర్ణయం, ప్రజా హక్కులను కాలరాసే నిర్ణయం.
వాస్తవానికి చిన్న మున్సిపాలిటీలతో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చు. శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో కలిపితే సమస్యల పరిష్కారానికి ఎవరు కమిషనర్ తో సమస్యలపై మాట్లాడాలి…? ఎవరు మేయర్ ని కలవాలి.
కెసిఆర్ నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాధ్యమని పది జిల్లాల నుంచి 33 జిల్లాలను చేసినం, కొత్త మండలాలను ఏర్పాటు చేశాం. రెవెన్యూ డివిజన్లను, పోలీస్ కమిషనరేట్లను పెంచాం.
వికేంద్రీకరణను వదిలి కేంద్రీకరణ వైపుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తప్పు. ఈ నిర్ణయము పైరవీకారులకు, బడ వ్యాపారులకు లాభం చేకూర్చే నిర్ణయమే తప్పా పేద ప్రజలకు ఎటువంటి మేలు చేయదు.
ఇప్పటికే మున్సిపాలిటీలలో శానిటేషన్ విభాగంలో సిబ్బంది చేయాల్సిన పనిని కూడా హైడ్రా చేస్తా అంటున్నారు హైడ్రా కమిషనర్.
మీరు తీసుకున్న నిర్ణయం అర్థరహితం,బాధ్యతారాహిత్యం… ఇది ప్రజల పాలిట శాపంగా మారిన నిర్ణయమే తప్ప ప్రజలకు జరిగేది ఏమీ లేదు.
శివారు మున్సిపాలిటీల విలీనంపై స్టేక్ హోల్డర్, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


