Kolan Hanmanth Reddy : సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ వాసులు పవన్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 2,50,000/- ( రెండు లక్షల యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పవన్ కుమార్ కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు.

అనంతరం పలువురు పేదలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ని మంజూరు చేయించి ఈరోజు నిజాంపేట్ ప్రగతి నగర్ వాసులు తొండిపు సతీష్ శ్రవణ్ కి రూ.60,000/-, దేవేందర్ నగర్ వాసులు కూతురు నిర్మల కి రూ.60,000/-, 131 డివిజన్ చింతల్ వాసులు కే శేషగిరిరావు కి రూ.50,000/-, వల్లభాయ్ నగర్ వాసులు కుమ్మురత్నం కి రూ 60,000/- , 129 డివిజన్ సూరారం శివాలయం నగర్ వాసులు నక్క సుశీల కి రూ 32,500/-, 125 డివిజన్ చంద్రగిరి నగర్ వాసులు మహమ్మద్ హమీద్ కి రూ. 53,500/-, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి వాసులు సురకంటి ప్రభాకర్ కి రూ 60,000/- CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు.

హన్మంతన్న మాట్లాడుతూ…. సీఎం రిలీఫ్ మరియు LOC ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, బహదురుపల్లి మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి (గోపాల్) పద్మ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గణేష్, పెరిక శివ, ఎండి జాకీర్ , సంతోష్ ముదిరాజ్, రాజి రెడ్డి, ప్రవీణ్(లడ్డు), భాస్కర్ రెడ్డి, గురువ రెడ్డి నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Relief Fund is a great boon for the poor

You cannot copy content of this page

Scroll to Top