పొట్టి ప్రపంచకప్ మళ్ళీ భారత్‌దే..
తుదిపోరులో కివీస్‌పై అద్భుత విజయం
Trinethram News : అహ్మదాబాద్, మార్చి 08, ధనాధన్ క్రికెట్ పండుగ ముగిసింది. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్‌ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. తద్వారా 2024లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకుని, పొట్టి ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
సమిష్టి కృషితో విజయం…. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, ఇషాన్ కిషన్ అర్థ శతకంతో చివర్లో హార్దిక్ పాండ్య, శివమ్ దూబే మెరుపులు మెరిపించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో, అక్షర పటేల్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డి విరవగా, కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
2024 తర్వాత వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్‌కు తొలి మేజర్ ఐసీసీ ట్రోఫీని అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నారు.
ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలువురు ప్రముఖులు టీమ్‌ఇండియాకు అభినందనలు తెలిపారు. “ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం” అని క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


