Rama Rao Dora demands : “డబ్బులు కొట్టు – ప్లేస్ పట్టు” – వైద్య శాఖలో అక్రమ డెప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి
అల్లూరి జిల్లా ఫిబ్రవరి 27, (త్రినేత్రం న్యూస్): ఉమ్మడి అల్లూరి జిల్లా వైద్యాశాఖలో ఇప్పటివరకు చేసిన అక్రమ డెప్యూటేషన్లు రద్దు చేయాలని, సీజనల్ వ్యాదులు ప్రబలకుండా గ్రామిన ప్రాంతాలకు సేవలు విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర డిమాండ్ చేసారు.
ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరేసి వైద్యాదికారులను నియమించిందని, పాడేరు కొత్త (డిఎం. హెచ్ ఓ) బాద్యతలు చేపట్టిన కొద్ది రోజులకే తన చేతివాటంతో వైద్యాధికారులు మొదలు, కిందిస్థాయి సిబ్బంది వరకు డెప్యూటేషన్లు కింద వారికి నచ్చిన చోటికి పంపించివేశారని మీడియాకు తెలిపారు. ఏజెన్సి ప్రాంతంలో ఆదివాసులకు వైద్య సేవలు అందకుండా చేసిన, కృష్ణమూర్తి నాయక్ ను ఆ పదవి నుండి తప్పించి, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
సాధరనంగానే ప్రతీ డిపార్టమెంట్ లో ఆరోగ్య కారణాల రిత్యనో, ఇతర ప్రత్యేక కారణాల రిత్యానో కొంతమంది డెప్యూటేషన్లు కింద వెళ్తారని, కాని, ఎఎస్సార్ జిల్లా వైద్యశాలో మాత్రం “డబ్బులు కొట్టు – నచ్చిన ప్లేస్ పట్టు” అంటూ డిఎం&హెచ్వో కృష్ణమూర్తి నాయక్ చేతులు తడిపితేచాలు అవసరం ఉన్నలేకున్నా తాము కోరుకున్న చోటికి ఎక్కడికైనా వెళ్ళవచ్చని నిరుపించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
విశాఖపట్నం కెజిహెచ్ ట్రైబల్ సెల్లో డాక్టర్ ఉంటుండగానే అదనంగా అనంతగిరి మండలం లొంగుపర్తి, పెదబయలు మండలం గోమంగి, కొయ్యూరు మండలం డౌనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను, పాడేరు డిఎం&హేచ్వో కార్యాలయపు అదనపు వైద్యాధికారిని జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండా డిప్యుటేషన్లపై పంపించరన్నారు.
అలాగే గ్రామ సచివాలయ ఎ.ఎన్.ఎం.లు, ఎం.పి.హెచ్.ఇ.వోలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు ఎల్.టి లు ) ఆరోగ్య పర్యవేక్షకులు (హెల్త్ సుపర్వైజర్లు)లను వారు కోరినచోటికి పంపించారన్నారు.
అలాగే, ఇటివలే కోర్టు ఆదేశాలతో ఎజేన్సికి వచ్చిన 18 మంది హెల్త్ అసిస్టంట్లను జిల్లా ఉన్నత అధికారులకు తెలియజేయకుండా మైదాన ప్రాంతాలకు పంపించి ఎజేన్సిలో వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నరన్నారు. జి మాడుగుల మండలం గెమ్మెలి పి.హెచ్.సి లో ముగ్గురు హెల్త్ అసిస్టెంట్లు ప్రభుత్వం పంపిస్తే, డిఎం&హేచ్వో అదే రోజు తిప్పి పంపించివేశారని మండిపడ్డారు.
సాధారణగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని డిప్యుటేషన్ పై పంపించే టప్పుడు అక్కడ పని నష్టం ( వర్క్ లాస్) కాకుండా జాగ్రత్తలు తిసుకుంటారని, కాని, పాడేరు డిఎం&హేచ్వో మాత్రం అవేమి పట్టించుకోరన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది పరిస్థి (స్టాఫ్ పొజిషన్) ఎలాఉందొ ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ అఫిసర్లను అడగకుండానే నేరుగా డిఎం&హేచ్వో ఆఫీసులో డిప్యుటేషన్ ఆర్డర్స్ రెడీ అవుతుందని, వారిని రిలీవ్ చేయని మెడికల్ అఫిసర్లపై డిఎం&హేచ్వో తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
పాడేరు డిఎం& హెచ్.ఓ అక్రమ డిప్యుటేషన్లు, అవినీతి వ్యవహారలపై, అలాగే తన మిత్రుడు లక్ష్మీపురం పి.హెచ్.సి (ఎటపాక) మెడికల్ ఆఫీసర్ మురళికృష్ణలు కలిసి ఆ శాఖలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని, వారి బంధువులను వేదింపులకు గురిచేస్తున్న ఫోన్ కాల్ కికార్డులను ఎఎస్సార్, పోలవరం జిల్లాల కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కి అందజేసామన్నారు.
అయితే లక్ష్మీపురం మెడికల్ ఆఫీసర్ మురళికృష్ణ తన వేదింపులు ఆపకపోగా, మరింత పెచ్చురిల్లుతుందన్నారు. వీరిపై కలెక్టర్ స్థాయిలో చర్యలు చేపట్టకపోతే, ఆ పై అధికారుల దృష్టికి తిసుకేల్లడంతోపాటు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

