Vangaveeti Ranga : ఏడిదిలో ఘనంగా

TRINETHRAM NEWS

దివంగత వంగవీటి రంగా 78 జయంతి వేడుకలు…
మండపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు దివంగత వంగవీటి మోహన రంగా అని ఏడిద జనసేన అధ్యక్షులు రామిశెట్టి రాజా అన్నారు.మండపేట మండలంలోని ఏడిద గ్రామంలో ఉన్న దివంగత వంగవీటి రంగా విగ్రహం వద్ద 78 వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిద గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు రామిశెట్టి రాజా, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పర్వతిన వీర్రాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రామిశెట్టి రాజా మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు అండగా పేద ప్రజలకు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిన ఘనత ఆయనదే అన్నారు.

ప్రజల కోసం తన యావదాస్తి తృణప్రాయంగా పంచిపెట్టిన దాన కర్ణుడు అని కొనియాడారు.పేద ప్రజల కష్టాల తీర్చటం కోసం దేశ ప్రధానిని సైతం ఎదురించిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. పర్వతిన వీర్రాజు మాట్లాడుతూ కుల మతాలకు అతితంగా అన్ని వర్గాల ప్రజల గుండెల్లో నేటికీ చిర స్థాయిగా ఉన్న మహోన్నత వ్యక్తి రంగా అని అన్నారు.ఈ కార్యక్రమంలో బండారు రాంబాబు,రామిశెట్టి చిన్న,కొండపల్లి సతీష్, చిలుకూరి కృష్ణ,గొడవర్తి ఎర్రబ్బు ,కత్తుల హేమంత్,ముగ్గుల్ల కాలికృష్ణ,మణి,పలివెల సూర్య రావు,లంక రాణా పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In Edidhi

You cannot copy content of this page

Scroll to Top