Trinethram News : విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సమావేశం ప్రారంభమైన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పొడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలు కూడా యత్నించాయి. గీతం యూనివర్సిటీకి సంబంధించిన వివాదాస్పద భూముల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సభలో నినాదాలు, ఆందోళనలతో వాతావరణం వేడెక్కింది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సభ నిర్వహణపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


