జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్సా నాగబాబు, ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అందరి ఆధ్వర్యంలో ఆయన కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, ఆధ్వర్యంలో ధర్మగుండం చెరువు వద్ద ఉన్న మయూరి వృద్దాశ్రమంలో వేగుళ్ళ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. తొలుత వృద్దులతో కలసి కేక్ కట్ చేసి వేగుళ్ళకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ స్వీట్లు పంచారు. ఈ సంధర్బంగా వృద్దులకు రాంబాబు భోజనాలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

birthday celebrations of MLA Vegullu

You cannot copy content of this page